నేను నా ప్రపంచం Telugu Vlogs
నేను నా ప్రపంచం Telugu Vlogs's Channel
 
 
 
 
 
నేను నా ప్రపంచం Telugu Vlogs
Your channel viewers will see links here, including "subscribe" and "add as friend".
Profile
 
Name
నేను నా ప్రపంచం Telugu Vlogs
Description
**“నేను నా ప్రపంచం ”Telugu Vlogs 🌳 ఛానల్ కి స్వాగతం సుస్వాగతం 🙏 💐 లో ఇకనుంచి ఒక్క భక్తి విషయాలకే పరిమితం కాకుండా, మన రోజువారీ జీవితానికి ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలను మీతో పంచుకోబోతున్నాను.
🍲 రుచికరమైన వంటలు
🌿 ఆ వంటల్లో ఉపయోగించే పదార్థాల పోషక విలువలు, ఉపయోగాలు
📖 మనసుకు హత్తుకునే మంచి కథలు
🙏 దేవుళ్లకు సంబంధించిన పురాణ కథలు, ఆధ్యాత్మిక విషయాలు
🌸 మన సంప్రదాయాలు, ఆచారాలు, పండుగల విశేషాలు
💭 జీవితానికి ఉపయోగపడే మంచి మాటలు, సూక్తులు
🎥 ఇంకా… మీకు ఉపయోగపడే, ఆనందాన్ని ఇచ్చే ఎన్నో మంచి వీడియోలు.
అంటే… మన వంటింటి నుంచి వంటలు వాటి పోషక విలువలు జీవితానికి ఉపయోగపడే విషయాల వరకు — అన్నీ 🌿❤️ నేను నా ప్రపంచం Telugu Vlogs లో
ఇది నా చిన్న ప్రపంచం…
మీ అందరినీ ఇందులో భాగస్వాములుగా చేసుకోవాలనుకుంటున్నాను. 🤗
ఇంతకాలం **“నిత్య భక్తి”**గా నన్ను ఆదరించిన మీరే, ఇకపై *🌳నేను నా ప్రపంచం”🌳Telugu Vlogs🌳 ను కూడా నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. 🙏❤️
మీ ప్రేమే నా బలం…
మీ ఆదరణే నా ప్రయాణం. 🌷
మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.🙏
Subscribers
197
Subscriptions
Recent Activity  
నేను నా ప్రపంచం Telugu Vlogs నేను నా ప్రపంచం 🌳 చానల్ కి స్వాగతం సుస్వాగతం 🙏 కార్తీక మాస కోటి సోమవారం విశిష్టత 🙏 కార్తీక మాసం శివకేశవుల ఆరాధనకు అత్యంత పవిత్రమైన మాసం.ఈ మాసంలో శివనామస్మరణ, శివలింగ అభిషేకం, బిల్వార్చన, దీపారాధన, ఉపవాసం, దానధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కోటి సోమవారం మహాత్మ్యం గురించి తెలుసుకుందాం. భక్తితో చేసే ప్రతి పూజ మనసుకు ప్రశాంతతను, ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. కోటి సోమవారం విశిష్టతను పూర్తిగా తెలుసుకోవాలనుకునే భక్తులు మా శ్రీ చక్ర లలితా అమ్మ ఛానల్‌లోని ప్రత్యేక వీడియోను తప్పక వీక్షించండి. 👇 https://youtu.be/r7ZK3CyVXl8 శివకేశవుల అనుగ్రహం అందరి కుటుంబాలపై ఉండాలని కోరుకుంటున్నాను. 🙏 ఓం నమఃశివాయ 🙏 🙏 జై త్రినాథ స్వామి🙏 (8 days ago)
 
 
నేను నా ప్రపంచం Telugu Vlogs నేను నా ప్రపంచం 🌳 ఛానల్ కి స్వాగతం సుస్వాగతం 🙏 స్కంద షష్ఠి శుభాకాంక్షలు 🙏 ఆరు ముఖాలతో భక్తులకు అభయమిచ్చే ఆ షణ్ముఖుడికి నమస్కారం! 🙏🙏🙏🙏 తమిళనాడులో ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పర్వదినం స్కంద షష్ఠి. 💐 సుబ్రహ్మణ్య స్వామివారు సూరపద్మాసురుడిపై విజయం సాధించిన విజయానికి గుర్తుగా స్కంద షష్ఠిని ఆరు రోజుల పాటు మహోత్సవంగా జరుపుకుంటారు🙏. ఈ ఆరు రోజులు భక్తులు ఉపవాసం, నియమ నిష్ఠలు, ప్రార్థనలు, సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణతో వ్రతాన్ని ఆచరిస్తారు. కొందరు పూర్తిగా ఉపవాసం ఉంటే, మరికొందరు పాలు, పండ్లు లేదా సాత్విక ఆహారంతో నియమాన్ని పాటిస్తారు. 🙏 తమిళనాడులోని తిరుచెందూర్ వంటి ప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో ఆరు రోజుల పాటు విశేష పూజలు, అభిషేకాలు, భజనలు నిర్వహిస్తారు. ఆరవ రోజు సూరసంహారం ఘట్టాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మరుసటి రోజు తిరుకల్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటారు. 🙏 ఈ ఆరు రోజుల వ్రతం మనలోని అహంకారం, కోపం, అసూయ వంటి చెడు గుణాలను జయించి, భక్తి, సహనం, ఆత్మనిగ్రహం పెంపొందించుకోవాలనే ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. వేలాయుధధారి అయిన ఆ కుమారస్వామి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సకల శుభాలు కలగాలని మనసారా ప్రార్థిద్దాం. వెట్రి వేల్ మురుగన్‌కు అరోహరా! హరోహరా షణ్ముఖా! 🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🪔 (9 days ago)
 
 
నేను నా ప్రపంచం Telugu Vlogs నేను నా ప్రపంచం teulgu vlogs లో నా మౌనం తో మాటలు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిఏ బంధుత్వం లేకపోయినా స్నేహం అనే బంధంతో మనసులు కలిశాయి. ఆ స్నేహంలో నా వయస్సును కూడా మర్చిపోయాను… ఎంతసేపైనా మాట్లాడాలని, సంతోషంగా ఉండాలని మమకారం పెంచుకున్నాను కానీ 😔 ఒకరోజు ఆ స్నేహమే దూరమైపోయింది… ఆప్యాయంగా పలకరించినా సరే నా వాళ్లు అని నువ్వు అనుకోవద్దు”అనే ఒక్క మాట నా గుండెను పిండేసింది.అటువంటి స్నేహితులు నా దగ్గర కు రాకుంటే బాగుంటుంది ఎందుకంటే ఏడ్చే ఓపిక లేదు కనుక మనస్ఫూర్తిగా ఇచ్చిన ఆప్యాయతకుఎప్పుడూ ప్రతిఫలం ఆశించలేదు…కానీ మనసులో చోటిచ్చిన స్నేహితులు మనల్ని పరాయి వాళ్లుగా భావించినప్పుడు ఆ బాధ మాటల్లో చెప్పలేం.కొన్ని బంధాలు రక్తంతో ఏర్పడవు… మనసుతో ఏర్పడతాయి.అందుకే అవి తెగిపోయినప్పుడు గాయం కనిపించదు. నరకం మాత్రమే మిగులుతూ బాధ మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది. దూరమైన స్నేహాన్ని మర్చిపోవచ్చు… కానీ ఆ స్నేహంలో మనం అనుభవించినఆప్యాయతను మాత్రం మర్చిపోలేం. కొంతమంది మన జీవితంలోకి వచ్చేది ఎప్పటికీ ఉండటానికి కాదు… మనసులో ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడానికి. మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఆ స్నేహని పరిచయం చేసి నాకు కొత్త నరకం వద్ధు శంకరా అని అడగాలని ఉంది ఈ గుండె ఈ బరువు మోయలేకపోతుంది ఈశ్వరా 🙏😭🌿 (1 month ago (edited))
 
 
నేను నా ప్రపంచం Telugu Vlogs 🌳నేను నా ప్రపంచం 🌳 స్వాగతం సుస్వాగతం 🙏 నా స్నేహితులు అందరకీ శుభోదయం 🙏 కలియుగంలో భగవంతుడిని చేరుకోవడానికి అత్యంత ముఖ్యమైన ఇంకా సులువైన మార్గం "నామస్మరణ" లేదా "భక్తి మార్గం . కృతయుగంలో ధ్యానం,,త్రేతాయుగంలో యజ్ఞాలు,,ద్వాపరయుగంలో అర్చనల ద్వారా లభించే పుణ్యం, కానీ ,కలియుగంలో కేవలం భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఉండడమే ఆ భగవంతుడు దగ్గరకు చేరడానికీ సరైన మార్గం మాత్రమే 🙏🙏🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏🙏🙏🙏🙏 శుభ శనివారం 🙏🙏🙏🙏 (1 month ago)
 
 
Friends
Channel Comments
IndirasKitchenandLiving (1 month ago)
3:01
DyaN_dreamworld (1 month ago)
Ok sri amma garu.
learnwithshubhra221 (1 month ago)
Nice recipe
IndirasKitchenandLiving (1 month ago)
Beerakaaya loni poshaka viluvalu gurinchi chala aaaaa chakkaga cheppaaru andi
Vikrant.-007-win (1 month ago)
Hi amma good morning have a good day
maruthiwonders (1 month ago)
బీరకాయ కర్రీ చక్కగా చేశారు అందులో ఉన్న పోషకాలు అన్నీ చక్కగా వివరించారు
RamaDubaivlogs (1 month ago)
10th like
Vr_varsha-varma (1 month ago)
నాకు బీరకాయ చట్నీ అంటే ఇష్టం అక్క
Vr_varsha-varma (1 month ago (edited))
హాయ్ అక్క 4లైక్
Jyothicollection666 (1 month ago)
చాలా బాగా చెప్పావు అక్క బీరకాయ గురించి
RamaDubaivlogs (1 month ago)
బీరకాయ టమాట కూర & బీరకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అక్క ️
g.screativity6717 (1 month ago)
ఓం శ్రీమాత్రే నమః శ్రీ లక్ష్మీ చెల్లి జైశ్రీరామ్ సూపర్
SwathiKitchenCreations (1 month ago)
బీరకాయతో మంచి కర్రీ చేశారు సిస్టర్ బీరకాయలో ఉన్నప్పుడు పోషకాల గురించి like
Jyothicollection666 (1 month ago)
నాకు ఐతే ఫ్రై